Site icon NTV Telugu

“లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్

Mrunal Thakur First Look as Sita from Hanu Ragahvapudi film

మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో మృణాల్ చాలా అందంగా ఉంది. ఆమె దుల్కర్ సల్మాన్ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. దుల్కర్, మృణాల్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

Read Also : అల‌రించ‌డ‌మే తెలిసిన … దేవి శ్రీ ప్ర‌సాద్

మృణాల్ ఠాకూర్ చివరిసారిగా “తూఫాన్”లో కనిపించారు, ఇందులో ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో మృణాల్ అనన్య పాత్రలో నటించింది. ఆమె హిందీ, మరాఠీ సినిమాలలో కూడా బిజీ అవుతోంది. టెలివిజన్ సీరియల్స్ ద్వారా ముఖ్యంగా “కుంకుమ్ భాగ్య”లో బుల్బుల్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. 2019లో ఠాకూర్ యాక్షన్ థ్రిల్లర్ “బాట్లా హౌస్‌”లో మృణాల్ కన్పించింది.

Exit mobile version