NTV Telugu Site icon

Mrunal Thakur: వీడియో మార్ఫింగ్.. అభిమానికి షాక్ ఇచ్చిన మృణాల్

Mrunal Thakur

Mrunal Thakur

మృణాల్ సౌత్ సినిమాల్లో రచ్చ చేస్తోంది. ఆమె సినిమాల్లో పని చేయడానికి ముందు అనేక హిట్ టీవీ సీరియల్స్ లో కనిపించింది. చేసిన కొన్ని సినిమాలతోనే మృణాల్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా, నటి తన అభిమాని షేర్ చేసిన ఒక వీడియోకి తన నిరాశ వ్యక్తం చేసింది. దీంతో పాటు అతన్ని మందలించింది కూడా. అసలు విషయం ఏమిటంటే దీపావళి రోజున ఒక అభిమాని ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేయడం మృణాల్ ఠాకూర్‌కి నచ్చలేదు. ఆమె సదరు పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ అభిమానికి షాక్ ఇచ్చింది.

Pushpa 2 The Rule: పుష్ప 2 హెచ్డీ ఫొటోలు కావాలా.. ఇలా చేయండి!

కొన్ని గంటల తర్వాత, నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ ఎడిట్ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేశారని చూసినప్పుడు తన గుండె పగిలిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ ఎడిట్ చేసిన వీడియోలో అభిమాని మృణాల్‌తో కలిసి క్రాకర్స్ పేల్చడం కనిపించింది. ఆ వీడియోపై ఆమె “సోదరా, మీరే ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు? మీరు చేస్తున్న పని బాగుంది అని అనుకుంటున్నారా? అంటూ కామెంట్ చేసింది. కొన్ని గంటల తర్వాత, నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అదే వీడియోను షేర్ చేసింది: “మీరు ఒకరోజు మంచి వీడియోస్ ఎడిట్ చేస్తారని ఆశిస్తున్నాము! దీపావళి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది.

Show comments