Site icon NTV Telugu

Mrunal : మెగాస్టార్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న మృణాల్..!

Mrunal Taguk

Mrunal Taguk

ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది మృనాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమా. తర్వాత నానితో చేసిన సినిమా ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయిపోయింది.

Also Read : Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..

కానీ మళ్ళీ ఎట్టకేలకి యువ హీరో అడివి శేష్ తన ‘డెకాయిట్’ సినిమా లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాకుండా తన చేతిలో మరో తెలుగు మూవీ ఉందా లేదా అనేది సస్పెన్స్‌గా మారినా టైంలో.. తనపై ఓ కొత్త రూమర్ మొదలైంది. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్  మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా అంటూ చాలా మంది పేర్లు వినబడ్డాయి.

అయితే మెగాస్టార్ సరసన మేకర్స్ మృణాల్ కూడా బాగుటుంది అని భావించారట. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె పేరును అనుకున్నారు కానీ మృణాల్ మాత్రం ఈ కాంబినేషన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఆమెని మేకర్స్ వద్దనుకున్నట్టుగా మరో టాక్. కాగా మృణాల్ ఇపుడు తెలుగులో పెద్దగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ చిరు, అనిల్ మూవీని వదులుకోవడం తెలివితక్కువ తనం అనే చెప్పాలి. దీంతో మేకర్స్ ఇప్పుడు ఆమెకు బదులు మరో బ్యూటీని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version