Site icon NTV Telugu

Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!

Mrunal

Mrunal

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెర పైన సందడి చేసిన ఆమె మెల్లగా బాలీవుడ్ పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె కష్టానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ లో మొదటి చిత్రం ‘సితారామం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది మృణాల్. సీత పాత్రలో చెరగని ముద్ర వేసుకుంది. తన నటనతో అందంతో అందరిని కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్ వచ్చినప్పటికి అచితూచి సినిమాలు చేసింది. దీంతో స్టార్ హీరోయిన్‌లకు ఈ అమ్మడు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు కానీ గ్యాప్ ఇచ్చింది. ఎవరికైనా స్టార్ డమ్ ఉన్నప్పుడే అవకాశాలు ఎక్కువగా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ మృణాల్ ఠాకూర్ పరిస్థితి మరొక లాగా ఉన్నదట.

Also read:Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?

రీసెంట్‌గా హీరో శివ కార్తికేయన్‌‌కి జంటగా ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది. కారణమేంటో తెలియదు కానీ ఆ మూవీని తాను వదులుకున్నదట. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న మృణాల్‌ని ఎందుకు సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు అనే ప్రశ్న తలెత్తడంతో.. మృణాల్ మాట్లాడుతూ ‘నేను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారు. అందుకే వచ్చిన ప్రతి సినిమా ఓకే చేయకుండా, నా పాత్రల ఎంపిక విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మరి అడుగులు వేస్తున్నా. అందుకే సినిమా సినిమాకు అంత మేరకు గ్యాప్ వస్తుంది’ అని తెలిపింది. కానీ ప్రజంట్ తన చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి? అనే దాని మాత్రం చెప్పలేదు. తెలిసినంత వరకు టాలీవుడ్ లో మాత్రం మృణాల్‌కి ఎలాంటి అఫర్ లు లేవని టాక్.

Exit mobile version