Mouli: యూట్యూబ్ వీడియోలతో మొదలై, ‘90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో మౌళి ఇప్పుడు కెరీర్‌లో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు. గతేడాది వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా బ్లాక్‌బస్టర్ కొట్టిన మౌళి, తాజాగా ‘DNK’ (దొంగ నా కొడుకు) చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఒకవైపు తెలుగులో తన మార్క్ కామెడీ, నేచురల్ యాక్టింగ్‌తో దూసుకుపోతూనే, ఇప్పుడు తన మూడో సినిమాతో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేశాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళంలో ‘గుడ్ నైట్’, ‘లవర్’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి, కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మిలియన్ డాలర్ స్టూడియోస్’ ఇప్పుడు మౌళితో జతకట్టడానికి సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది. తన మూడో సినిమా కోసం మౌళి ఈ క్రేజీ బ్యానర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అచ్చమైన మధ్యతరగతి భావోద్వేగాలను, మనసును హత్తుకునే కథలను తెరకెక్కించడంలో ఈ బ్యానర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి నిర్మాణ సంస్థతో మౌళి సినిమా ఉండబోతున్నట్లు వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మౌళి కామెడీ టైమింగ్, కుర్రాళ్ల మనసును తాకే న్యాచురల్ యాక్టింగ్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూసి నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు సైతం మౌళి నటనను మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘గుడ్ నైట్’, ‘లవర్’ వంటి సున్నితమైన కథలను అందించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్‌లో మౌళి నటిస్తే, ఆ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో తన సత్తా చాటిన మన ‘దొంగ నా కొడుకు’ హీరో, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా నేరుగా చేరువయ్యే ఛాన్స్ దక్కుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

