Site icon NTV Telugu

Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’కి సూపర్ రెస్పాన్స్

Mothevari

Mothevari

ZEE5 గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇందులో అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 8న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే 2,00,000 మందికి పైగా వీక్షకులను ఆకర్షించింది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ని నిర్మించారు.

Also Read : Tollywood : ప్రొడ్యూసర్స్.. ఎందుకీ రెండు నాల్కల ధోరణి?

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ ఆరెపల్లి గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊర్లోని పర్షి (అనిల్ గీలా) అనే యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. అతను సత్తయ్య (మురళీధర్ గౌడ్) కుమార్తె అనిత (వర్షిణి)తో ప్రేమలో పడతాడు. కానీ సత్తయ్య, అతని సోదరుడు నర్సింగ్ (సదన్న) తమ దివంగత తండ్రి రాసిన ఓ వీలునామాను బయటపడటం, దీంతో ఓ భూ వివాదం చెలరేగడం.. ఇక దీంతో హాస్యం, భావోద్వేగాలు పుట్టుకు రావడం, చివరకు ఊహించని మలుపులకు దారి తీయడం జరుగుతుంది. విడుదలైనప్పటి నుండి ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ZEE5 లోని ట్రెండింగ్ చార్టులలో ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. 3 రోజుల్లో 2,00,000లకు పైగా వీక్షకులను ఆకర్షించి కొద్ది కాలంలోనే ‘మోతెవరి లవ్ స్టోరీ’ తెలుగు రాష్ట్రాలలోని అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది.

Exit mobile version