NTV Telugu Site icon

Monalisa: మోనాలిసా ఫ‌స్ట్ మూవీకి అన్ని లక్షలు ఇచ్చారా?

Monalisa

Monalisa

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌లో దండలు అమ్మడానికి ఇండోర్ నుండి వచ్చిన అమ్మాయి మోనాలిసా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఆమె కళ్ళను చూసి పిచ్చిగా ప్రేమలో పడిపోతున్నారు చాలామంది. దండలు అమ్ముకునే అమ్మాయిగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన మోనాలిసా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఆ సినిమాల్లో ఆఫర్ కూడా వచ్చింది. ఆమె నటన నేర్చుకోవడానికి ముంబైకి వెళ్లిపోయింది.

Pushpa 2 : ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ ‘పుష్ప 2’.. నేడు థాంక్యూ మీట్

దర్శకుడు సనోజ్‌ మిశ్రా త‌న చిత్రంలో ఆమెకు అవ‌కాశం ఇచ్చారు. ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ పేరుతో తెరకెక్క‌నున్న త‌న మూవీ కోసం మోనాలిసా అగ్రిమెంట్ కూడా చేసింది. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు సనోజ్ మిశ్రా. అయితే ఆమె ఫ‌స్ట్ మూవీ రెమ్యున‌రేష‌న్‌ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకి గాను మోనాలిసాకు రూ.21 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్‌గా అందిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఆమె స్థానికంగా బిజినెస్ ప్రమోష‌న్స్ కోసం రూ. 15 ల‌క్ష‌ల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.