NTV Telugu Site icon

Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’

Najrya

Najrya

నజ్రియా నజీమ్.. 29 ఏళ్ల ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన చలకీ నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్ర పోషించింది.. కొన్నేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ నటి మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహానాడిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. కాస్తా గ్యాప్ తీసుకుని ఒకటి అరా సినిమాలలో నటించింది. త ఆ దశలోనే తెలుగులో తొలి సినిమాలో నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాలో నటించింది. కానీ ఆశించినంత విజయం సాధించలేదు. 2022లో వచ్చిన ఈసినిమా తర్వాత నజ్రియా మరళ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

భారీ గ్యాప్ తర్వాత ఇటీవల ఓ మలయాళ సినిమాలలో నటించింది. స్టార్ దర్శకుడు భాసిల్ జోసెఫ్ హీరోగా వరుస హిట్స్ కొడుతున్నాడు.  తాజగా బాసిల్ జోసెఫ్ తో నజ్రియా సూక్ష్మ దర్శిని సినిమాలో నటించింది. లాంగ్ గ్యాప్ తర్వాత నజ్రియా చేసిన ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసింది. ఈ నెల 22న మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు బాక్సాఫీస్ పరంగాను సూక్ష్మదర్శిని దూసుకెళుతోంది. రిలీజ్ రోజు కేరళలో 1.60 కోట్లు రాబట్టగా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల మేర కలెక్ట్ చేసింది. ఇక రిలీజ్ అయిన మూడు రోజులకుగాను మొదటి వీకెండ్ కలిపి రూ. 15 కోట్లు కలెక్ట్ చేసింది సూక్ష్మ దర్శిని. గ్యాప్ ఇచ్చిన వచ్చినా గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది నజ్రియా. లాంగ్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

Show comments