NTV Telugu Site icon

Mollywood : మెగాస్టార్ – కంప్లిట్ స్టార్ భారీ మల్టీ స్టార్ట్.

Mmm

Mmm

మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి ఇద్దరు బడా స్టార్స్ చేతులు కలిపారు. మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వస్తున్న ఈ భారీ ముల్టీస్టారర్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి మరియు మోహన్‌లాల్‌ లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరి లెజెండ్స్‌తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్  కీలక పాత్రల్లో నటిస్తుండగా తమిళ లేడీ సూపర్ స్టార్  నయనతార ఈ సినిమాలో  కథానాయకిగా నటిస్తోంది.

Also Read : Arrsairaa : విడాకులపై రెహమాన్ స్పందన ఇదే

ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు శ్రీలంక దేశంలో గ్రాండ్ గా నిర్వహించారు. పూజ కార్యక్రమానికి సహ నిర్మాత  సుభాష్ జార్జ్ మాన్యువల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సి.ఆర్.సలీం తొలి క్లాప్ ఇచ్చారు. మోహన్‌లాల్‌తో పాటు,మెగాస్టార్ ముమ్మట్టి, కుంచాకో బోబన్ రాజేష్ కృష్ణ, సలీం షార్జా, అనురా మథాయ్, మరియు తేజస్ థంపి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ మరియు కొచ్చితో సహా పలు లొకేషన్‌లలో 150 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను సి.ఆర్.సలీం, సుభాష్ జార్జ్ మాన్యుయెల్‌లతో కలిసి ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇద్దరు స్టార్స్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మలయాళ సినిమాలో  మోస్ట్ అవైటెడ్  ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

Show comments