మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఉన్ని.. రీసెంట్‌గా యాక్షన్ మూవీ ‘మార్క్’ తో ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది.. ప్రస్తుతం ఓ రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నారని సమాచారం. ఇక సినిమాల పరంగా సక్సెస్‌ఫుల్ గా దూసుకుపోతున్న ఈ హీరో పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయింది. ఆయన తన పర్సనల్ మేనేజర్ పై దాడి చేయించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
Also Read :Mohanlal : క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
అసలు విషయం ఏంటంటే.. ఉన్ని మేనేజర్ అయినటువంటి విపిన్ కుమార్ వేరే హీరో గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన దగ్గర పని చేస్తూ వేరొక హారోని పోగడటంతో ఆయన కోపంతో రగిలిపోయి. ఈ కారణంగానే తనపై దాడి చేశారు అని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఉన్ని ముకుందన్ కలిసేందుకు వెళ్తున్నారని సమాచారం. ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీం గాని స్పందించలేదు… దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
