NTV Telugu Site icon

Mollywood 2024 : ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించిన మాలీవుడ్

Mollywood

Mollywood

ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా సత్తా చాటగలం అని ఫ్రూవ్ చేశాయి మలయాళ సినిమాలు. సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అండ్ కాన్సెప్టులతో ఎంటర్‌టైన్ చేశాయి. చేస్తున్నాయి. 96 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. రేర్ ఫీట్ టచ్ చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలంటే మలయాళ చిత్రాలే అనిపించేలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యింది మాలీవుడ్.

Also Read : Bollywood : హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఛాన్స్ కొట్టేసిన భామ

భారీ బడ్జెట్ చిత్రాలు కాదు  హీరోలకు ఓవర్ ఎలివేషన్ అంతకంటే ఇవ్వరు. కానీ సీట్ ఎడ్జ్‌పై కూర్చొబెట్టే సినిమాలను అందించింది. అందులోనూ ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా బ్లాక్ బస్టర్స్ చవి చూడటమే ఒక ఎత్తైతే మునుపెన్నడి లేని విధంగా ఐదు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లోకి చేరడంతో పాటు ఫస్ట్ టైం 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి  థియేటర్లు దద్దరిల్లడమే కాదు కాసుల వసూళ్లను చూసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. జస్ట్ 20 కోట్లతో తీసిన ఈ రియల్ స్టోరీకి ఆలోవర్ ఇండియా ఫిదా అయ్యింది. రూ. 240 కోట్లను వసూలు చేసి పాత లెక్కలు మార్చి  సరికొత్త లెక్కలు నేర్పింది. ఈ ఏడాదే కాదు  96 ఏళ్ల మాలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మలయాళ ఫిల్మ్‌గా నిలిచింది. మరో రియలిస్టిక్ స్టోరీతో తీసిన పృధ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ కూడా రూ. 160 కోట్లను రాబట్టుకుంది. వాస్తవిక సినిమాలకు  జేజేలు పలికారు మాలీవుడ్ ఆడియన్స్. ఇక ఫహాద్ ఫజిల్ ఆవేశం కూడా రూ. 156 కోట్లకు పైగా వసూలు చేసింది.

Also Read : SSH : ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ గ్రిప్పింగ్ ట్రైలర్ రిలీజ్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ప్రేమలు  కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఈ చిన్న సినిమా ఏకంగా రూ. 136 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఇయర్ సెకండాఫ్‌లో వచ్చిన టొవినో థామస్ ఏఆర్ఎంతో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఎచీవర్స్‌గా మారారు సౌబిన్, పృధ్వీ, ఫహాద్, టొవినో. ఇక పృధ్వీ, బాసిల్ కాంబోలో వచ్చిన గురువాయిర్ అంబలనడయిల్ వంద కోట్లకు దగ్గరగా వచ్చి చేరింది.    మొత్తానికి ఈ సంవత్సరం మాలీవుడ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.