Site icon NTV Telugu

Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్ బాబు?

Mohan Babu

Mohan Babu

నటనలో తనదైన ముద్ర వేసుకున్న టాలీవుడ్ వెటరన్ నటుడు మోహన్ బాబు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. ఇటీవల ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అంతకు ముందు ‘శాకుంతలం’, ‘సూరారై పోట్రు’ వంటి చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఆయన నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఘట్టమనేని జయకృష్ణ తొలి సినిమా కోసం విలన్ పాత్రలో నటించడానికి మోహన్ బాబు అంగీకరించారు.

Also Read : Yellamma : నితిన్, శర్వానంద్ కాదు.. బరిలోకి కొత్త హీరో?

‘RX 100’ మరియు ‘మంగళవారం’ వంటి సంచలన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అజయ్ భూపతి చెప్పిన కథ మోహన్ బాబుకి బాగా నచ్చడంతో, ఆయన ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా అధికారికంగా అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఈ సినిమాకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తదాని హీరోయిన్‌గా నటించనుంది. ఇది ఒక ఎమోషనల్ ప్రేమకథతో కూడిన రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఘట్టమనేని జయకృష్ణ తొలి సినిమాలోనే మోహన్ బాబుతో కలిసి నటించడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.

Exit mobile version