Site icon NTV Telugu

Mogudu Title Promo: మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం.. విశాల్‌ ‘మొగుడు’ ప్రోమో అదుర్స్!

Mogudu Title Promo

Mogudu Title Promo

తమిళ చిత్ర దర్శకుల్లో వినోదానికి పెట్టింది పేరు ‘సుందర్ సీ’. హారర్ చిత్రాలలో కూడా కామెడీ పండిస్తూ సూపర్ సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ సుందర్ తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు టైటిల్ ‘మొగుడు’గా ఫిక్స్ చేశారు. గ్లింప్స్ ఏకంగా 5 నిముషాలు ఉండడం విశేషం.

‘ఇలా చూడండి.. మొగుడులా ఉండటం ముఖ్యం కాదు, మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా’ అనే డైలాగ్‌తో మొగుడు గ్లింప్స్ మొదలైంది. ఈ డైలాగ్ యోగిబాబు చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ‘మొగుడుగా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు ఓర్పుగా ఉండడం ముఖ్యం’ అని చివరలో యోగిబాబు మరో డైలాగ్ చెప్పాడు. యోగిబాబు కామెడీ ఆహా అనే రీతిలో ఉంది. ఇందులో భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా తమన్నా కనిపించగా.. ఇంట్లో పనులు చేస్తూనే యాక్షన్‌తో అదరగొట్టాడు విశాల్.

Also Read: With Love Teaser: నవ్వులు పూయిస్తున్న అనశ్వర రాజన్ ‘లవ్ విత్’ టీజర్!

మొగుడు అనే టైటిల్‌తో ఇప్పటికే తెలుగులో సినిమా వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించిన మొగుడు చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో విశాల్ వస్తున్నారు. మొగుడు షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. విశాల్‌ 36వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

Exit mobile version