Missing Meghana: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా, ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు భావోద్వేగాలకు గురిచేసేలా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ (హుక్ పాయింట్) ఆడియన్స్‌ను ముమ్మాటికీ షాక్‌కు గురిచేస్తుందని, కోట్లు ఖర్చుపెట్టి, తమ రెండేళ్ల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సినిమా తీశామని, ఇది వచ్చి వెళ్లే సాధారణ సినిమా కాదని దర్శకుడు వాచస్పతి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతుండటం ఇప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారింది.
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఎమోషనల్ థ్రిల్లర్‌పై ఉన్న నమ్మకంతో ఒక బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా రిలీజ్ హక్కులను సొంతం చేసుకుని, ఈ నెల 18న ఏకంగా 150కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆర్.ఆర్. ధృవన్ అందించిన సంగీతం చాలా ఫ్రెష్‌గా ఉందని యూత్ కనెక్ట్ అవుతున్నారు. దానికి తోడు టాప్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు విజువల్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. కంటెంట్, బిజినెస్ పరంగా సినిమా పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని నిర్మాత నరేష్ బాబు తెలిపారు. త్వరలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 18న థియేటర్లలోకి వస్తున్న ఈ ‘మిస్సింగ్ మేఘన’ ప్రేక్షకులను ఎంతమేర థ్రిల్ చేస్తుందో చూడాలి.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!