తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని, సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా కోసం సిద్ధం చేసిన వైబ్ ఉంది బేబీ సాంగ్‌తో పాటు, నిధి అగర్వాల్‌తో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా సినిమా టీం పక్కన పెట్టేసింది. సినిమాలో ఈ రెండు సాంగ్స్ చూడలేదు. అయితే, వైబ్ ఉంది సాంగ్ పెట్టడానికి కానీ, ఈ సాంగ్ పెట్టడానికి గానీ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా లేదు. ఈ రెండు సాంగ్స్ పెడితే కనుక సినిమా ఫ్లో దెబ్బతింటుందనే కారణంతో సినిమా యూనిట్ సినిమాలో సాంగ్స్ పెట్టకూడదని నిర్ణయం తీసుకుంది.
Also Read :RGV: మిరాయ్ చూసి చెంపదెబ్బ కొట్టుకున్నా!
అయితే, తాజాగా నిధి అగర్వాల్ సాంగ్ ఎందుకు పెట్టలేదనే విషయం మీద డైరెక్టర్ స్పందించాడు. ఆమె సాంగ్ యాక్చువల్‌గా సెకండ్ పార్ట్ కోసం చేశామని, ఈ పార్ట్‌లో ఆమె సాంగ్ లేదని చెప్పుకొచ్చారు. సినిమా ఆఖరిలో రానాతో ట్విస్ట్ ఇస్తూ, సినిమాకి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. కాబట్టి, సెకండ్ పార్ట్ ఉంటుందని క్లారిటీ వచ్చేసినట్టే. దీంతో, నిధి అగర్వాల్ సాంగ్ లేదని బాధపడే వాళ్ళందరూ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడక తప్పదని చెప్పాలి. మరి వైబ్ ఉంది బేబీ సాంగ్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.
