Site icon NTV Telugu

Met Gala : మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?

Sharukhan

Sharukhan

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్లలో మెట్‌ గాలా ఒకటి. న్యూయార్క్‌ నగరంలోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ లో, ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్‌ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటులు షారుఖ్‌ ఖాన్ ‌, కియారా అడ్వాణీ , ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌, సింగర్ దిల్జిత్‌ దోసాంజ్‌, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ, తదితరులు రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ప్రతి ఒక్కరు విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇందులో ముఖ్యంగా బాద్‌షా డిఫరెంట్‌ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కానీ ఈ ఫోటోలపై ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Also Read : NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !

ఎందుకంటే.. షారుఖ్ ఖాన్ మొదటిసారి మెట్ గాలా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ నుండి SRK ఫోటోలు బయటకు వచ్చాయి, ఆయన లుక్ కి మిశ్రమ స్పందన వచ్చింది. SRK మేనేజర్ పూజా దదలానీ ఈ ఫోటోలను షేర్ చేశారు. అయితే ఇంత పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఫోటోలు.. పూజా ఖాతా నుంచి  షేర్ చేయడం ఏంటీ.. షారుఖ్ ఖాన్ షేర్ చేయాలి కానీ. అంటూ మండి పడుతున్నారు. ఆయన ధరించిన దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. పూర్తిగా బ్లాక్ డ్రెస్ లో ఆయన లేయర్డ్ నగలు ధరించారు, చేతిలో కర్ర, కళ్ళకు గాగుల్స్ ఉన్నాయి. కానీ షారుఖ్ ఖాన్ లుక్ చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఒక యూజర్ అయితే ‘సబ్యసాచి, నువ్వు ఆయన లుక్ ను కంప్లీట్ గా పాడు చేశావు’ అని, మరో యూజర్ ‘ఇది చూడటానికి నేను 3:30 వరకు మేల్కొని ఉన్నాను’ అని రాశారు. మొత్తానికి షారుక్ అభిమానులను కొంత నిరాషపరిచాడని చెప్పాలి.

Exit mobile version