Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memu COPlam: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 (జీ5) మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామెడీ – మిస్టరీ అంశాల కలయికతో తెరకెక్కిన ‘‘మేము‘కాప్’లం’’ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కథా నేపథ్యం:
మహదేవపట్నం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఊరి పెద్ద గజపతిరాజు (నాగబాబు) తన వారసుడు వచ్చాడంటూ ‘సలార్ రాజు’ను పరిచయం చేస్తాడు. అయితే, ఈ సలార్ రాజు మరెవరో కాదు.. కోళ్ల పందెంలో గెలవాల్సిన ఒక కోడిపుంజు. అనుకోకుండా ఆ కోడిపుంజు కనిపించకుండా పోవడంతో ఊళ్లో గందరగోళం మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి రవి, మోహన్ సోటారి అనే ఇద్దరు పోలీసులు (గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల) రంగంలోకి దిగుతారు. కోడిపుంజు కోసం వారు వెతికే క్రమంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు, వారు చేసే తప్పులు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే ఈ వెతుకులాటలో వారు ఊహించని విధంగా గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ రహస్యం ఏంటి? సలార్ రాజు దొరికాడా? లేదా? అనేదే ఈ సిరీస్‌లో చూడాల్సిందే.
Also Read
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
- Venky Anil5 : ఆ సినిమా రీమేక్ కాదు.. కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు
- Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
ఈ సిరీస్‌లో నాగబాబు ప్రధాన పాత్రలో నటించగా.. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కీలక పాత్రలు పోషించారు. ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని దీనిని నిర్మించారు. శోభన్ చిట్టుప్రోలు ఈ కథను అందించారు. మహదేవపట్నంలోని గందరగోళాన్ని, ఆ ఇద్దరు పోలీసుల హడావుడిని చూడాలంటే మే 22 వరకు వేచి చూడాల్సిందే. తెలుగు జీ5 ఒరిజినల్స్‌లో ఇదొక విభిన్నమైన సిరీస్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
116 Year Old Woman: తిరుపతిలో నమ్మశక్యం కాని దృశ్యం.. 3550 మెట్లు ఎక్కిన 116 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్..
-
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
-
Success Story: బీటెక్‌లో 24 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
-
E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
-
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..