ఇటీవల కాలంలో పెళ్లి పీటలెక్కబోతోంది అంటూ వార్తల్లో నిలిచిన మిల్కీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాద ఇప్పుడు టాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె “ఎఫ్-2″కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్3″లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నాలతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమానే కాకుండా రీసెంట్ గా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతోంది అనే ప్రకటన వచ్చింది. మారుతీ డైరెక్షన్ లో యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ పాత్ర పోషించనుంది మెహ్రీన్. ఇవే కాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణతో కూడా మెహ్రీన్ జోడి కట్టబోతోంది అనే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మెహ్రీన్ అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది.
Read Also : వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా… “హ్యాపీ ప్రైడ్” అంటూ పోస్ట్
“నా తదుపరి చిత్రం గురించి వస్తున్న ఊహాగానాలు నిరాధారమైనవి. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ నేను మీతో పంచుకునే వరకు దయచేసి ఇలాంటి వార్తలను నమ్మవద్దు” అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మొత్తానికి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందనున్న “ఎన్‌బికె 107″లో మెహ్రీన్ హీరోయిన్ కాదనే విషయంపై స్పష్టత వచ్చేసింది. మరి ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.