NTV Telugu Site icon

Megastar : జపాన్ కు మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే..?

Viswambhara

Viswambhara

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్‌ హీరోయిన్‌ త్రిష మరియు ఆషిక  రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి  సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Kubera : ధనుష్ నాగార్జున మల్టీ స్టారర్ ‘కుబేర’ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం VFX వర్క్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి కొంత మేర షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అయితే ఈ షెడ్యూల్ ను జపాన్ లో ప్లాన్ చేసాడు దర్శకుడు వశిస్ట. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి రేపు అనగా బుధవారం జపాన్ వెళ్లనున్నారు. అక్కడ షూట్ చేసే ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల  చేయాలని మొదట భావించిన మేకర్స్ చిరు తనయుడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ కానున్న కారణంగా  విశ్వంభర రిలీజ్ వాయిదా వేశారు.  ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.  కాగా  వచ్చే ఏడాది సమ్మర్ మే 9న రిలీజ్ కానున్న విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా దాదాపు  రూ. 200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.

Show comments