NTV Telugu Site icon

Megastar : చిరు – అనిల్ రావిపూడి- సైన్ స్రీన్స్

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ సరికొత్త సినిమాను అనౌన్స్ చేసారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా నేచురల్ నాని మరియు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు చిరు లైనప్ లో ఉన్నాయి.

Also Read : AlluArjun : పుష్ప -2 ఓవర్సీస్.. అనుకున్నదే జరింగింది

బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇందుకు సంబందించిన కథ చర్చలు మెగాస్టార్ తో ముగిశాయని అనిల్ రావిపూడి చెప్పిన పాయింట్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం అనిల్ దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరు సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు అనిల్ రావిపూడి, ఈ సినిమాతోఅర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాల డైరెక్టర్ సుందీప్ రెడ్డి వంగతోసినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి ఈ మూడు సినిమాలతో వింటేజ్ చిరును చూస్తారని, మెగాస్టార్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Show comments