తమిళనాడు సీఎం స్టాలిన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన చిరు కాసేపు స్టాలిన్ తో ముచ్చటించారు. ఆ సమయంలోనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పవన్ అభినందించారు.’ అయితే నేడు చిరు ఒక్కసారిగా స్టాలిన్ తో ప్రత్యక్షమయ్యే సారికి ఆసక్తిని రేపింది. తమ్ముడు పవన్ ట్వీట్స్ తో ప్రశంసిస్తే, అన్నయ్య చిరు నేరుగా కలిసి ఆయన్ను ప్రశంసించారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పొగడ్తలతో ముంచేయడంతో అసహనం వ్యక్తం చేశారు. సభ సమయాన్ని వీలైనంత ఎక్కువగా సమస్య-పరిష్కారాలపై మాట్లాడాలన్నారు. ఇకపై సభలో ప్రశంసలు- పొగడ్తలు చేస్తే చర్యలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు.
