Site icon NTV Telugu

Chiranjeevi in Spirit: ఓరి బాబోయ్..! స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

Sprit

Sprit

Megastar Chiranjeevi in Spirit: స్పిరిట్ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మెగాస్టార్ చిరంజీవిని ఈ మూవీలో ఒక స్పెషల్ పాత్రలో నటింపజేయడానికి ట్రై చేస్తున్నారని సమాచారం. గతంలో ‘యానిమల్’ చిత్రంలో అనిల్ కపూర్ క్యామియో పాత్ర ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో అందరికీ తెలిసిందే. ఒకవేళ చిరంజీవి ఈ మూవీ ప్రాజెక్టులో భాగమైతే, అది సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Also: MLA Raja Singh: 11 ఏళ్లుగా బీజేపీ నేతలు నాతో ఫుట్ బాల్ ఆడుకున్నారు..

అయితే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’, మల్లిడి వశిష్టతో ‘విశ్వంభర’, బాబీతో ‘మెగా 158’, శ్రీకాంత్ ఓదెలతో ‘మెగా 159’ లాంటి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో ఉండటంతో, సందీప్ రెడ్డి వంగ సినిమాకి మెగాస్టార్ టైం కేటాయిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఊహాగానాల నడుమ స్పిరిట్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.

Read Also: Kichcha Sudeep: ప్లీజ్ ఎవ్వరు నా ఇంటికి రాకండి.. ఈగ విలన్ షాకింగ్ పోస్ట్ వైరల్

కాగా, ప్రభాస్ ఇప్పటికే నటిస్తున్న ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ చివరి దశకు వచ్చేశాయి. ‘స్పిరిట్’ కోసం డార్లింగ్ బల్క్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. ఈ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. బాక్సాఫీస్‌ను ఊచకోత కోయడానికి ఈ కాంబో రెడీ అవుతోందని సినీ పరిశ్రమ అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీ నటిస్తుండగా.. విలన్ గా కొరియన్ స్టార్ డాన్లీని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై సందీప్ రెడ్డి వంగ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, నటులు తరుణ్, మండోనా సెబాస్టియన్, శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ ప్రచారంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version