NTV Telugu Site icon

Mega Star : విశ్వంభర సినిమాకు అనుకోని కష్టాలు.. రిలీజ్ డౌటే..?

Konidela Chiranjivi

Konidela Chiranjivi

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్‌ హీరోయిన్‌ త్రిష మరియు ఆషిక  రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి  సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Vijay 69: బాలయ్య సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న విజయ్..?

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తర్జన భజనలు నడుస్తున్నాయి. సంక్రాంతికి చిరు తనయుడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేసి సమ్మర్ కు విశ్వంభర రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అందుకు కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికి క్లోజ్ కాలేదని అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ అనే వార్తలు వినిపించాయి. కానీ విశ్వంభర ఓటీటీ డీల్ అయినా కాకపోయినా సరే ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మాత్రం మిస్సయ్యే సమస్యే లేదని నిర్మాణ సంస్థ యువి ఫిలింస్ నుండి క్లారిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ను డిసెంబరు 25న రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.

Show comments