NTV Telugu Site icon

Mega Star : మెగా సంబరాలకు సిద్ధం అవుతున్న ఫ్యాన్స్., కారణం ఇదే..?

Untitled Design 2024 08 16t135549.217

Untitled Design 2024 08 16t135549.217

ఆగ‌స్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్లన్స్ చేస్తున్నారు. దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఇక ఆదే రోజున మెగాస్టార్ సినిమాల లేటెస్ట్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read: State Awards: ఎడారిలో.. అవార్డుల పంట పండించిన సినిమా

ఇక అదే రోజున బి. గోపాల్ దర్శకత్వంలో చిరు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర ను రీరిలీజ్ చేయనుంది వైజయంతి మూవీస్. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వీటితో పాటు మెగాస్టార్ నెక్స్ట్ సినిమాల అప్ డేట్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చిరు నటించిన గాడ్‌ఫాద‌ర్ సినిమాను డైరెక్ట్ చేసిన మోహ‌న్ రాజాతో మరోసారి వ‌ర్క్ చేయ‌బోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చెన్నైలో శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Also Read: New release: థియేట్రికల్ రిలీజ్ కు విభిన్న చిత్రాల దర్శకుడి సినిమా..

చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఈ మూవీకి మోహన రాజ, బివిఎస్ ర‌వి సంయుక్తంగా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా చిరు బర్త్ డే కానుకగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇక విశ్వంభ‌ర విష‌యానికి వస్తే యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతుంది. త్రిష ఇందులో ప్ర‌ధాన క‌థానాయికగా నటిస్తుంది.

Show comments