Site icon NTV Telugu

Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా

Chiru

Chiru

ఐ బొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. పైరసీ ముఠా నుండి ఇండస్ట్రీని కాపాడిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను టాలీవుడ్ ప్రముఖులు ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతర సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెగాస్టర్ చిరంజీ, నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు

Also Read : SS Rajamouli : ఐ బొమ్మ రవి మీ పర్సనల్ డేటా అమ్ముకుంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా.  చాలా ఏళ్లుగా ఇండస్ట్రీని పైరసీ బాధించింది. ఎలా బయటపడాలా అని బాధపడే వాళ్ళం. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలు తీస్తోంది.  సినిమాను నమ్ముకుని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. లక్షలాది మంది సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా దోచుకుపోతుంటే తట్టుకోలేని పరిస్థితి. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ కష్టనష్టాలు తెలిసిన మాజీ సీపీ CV ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ ఇద్దరు ఎంతో శ్రమించి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ కి మా కృతజ్ఞతలు. పైరసీ ని ఇక్కడితో అరికట్టాలి. పైరసీ ఎవరు చేసిన ఉపేక్షించేది లేదు’ దీన్ని ఇలానే వదిలేయకుండా రాబోయే రోజుల్లో పైరసీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, మనమందం ఒక్కటిగా ఈ భూతాన్ని రూపుమాపాలి, బొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు మరొక్కసారి నా ధన్యవాదాలు అని అన్నారు.

 

Exit mobile version