NTV Telugu Site icon

Mega Star: సాయం చేయడంలోనూ ‘మెగాస్టార్’ అని నిరూపించుకున్న చిరంజీవి.. సాయం ఎంతంటే..?

Untitled Design (62)

Untitled Design (62)

కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదార మనుసును చాటుకున్నారు. కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు, సునామీ వ‌చ్చి ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ప్పుడు, ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు, కోన‌సీమ వ‌ర‌ద‌ల స‌మయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వ‌చ్చిన‌ప్పుడు, కోవిడ్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ప్పుడు.. ఇలా ఒక‌టేమిటి ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారికి అండ‌గా నిల‌బ‌డుతూ త‌న‌దైన స్పంద‌న‌ను తెలియ‌జేసే మొట్టమొదటి వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు తన భాద్యతగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్.

Also Read: Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక

ఇప్పుడు కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి వంద‌లాది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేర‌ళ ప్ర‌భుత్వానికి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే త‌మ మ‌ద్ధ‌తుని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి వ‌య‌నాడ్ బాధితుల కోసం కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా సానుభూతిని ప్ర‌క‌టించారు.

Show comments