Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే

Rajamouli, Trivikram, Sukumar Next Movies

Rajamouli, Trivikram, Sukumar Next Movies

భారతీయ చిత్రసీమలో దర్శకుల స్థాయి కేవలం ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయికి విస్తరించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వస్తున్న స్టార్ డైరెక్టర్లు బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. తమ ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉన్న ఈ విజనరీ డైరెక్టర్స్.. తమ తదుపరి సినిమాల కోసం అత్యంత భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. భారతీయ చిత్రసీమలోని టాప్ డైరెక్టర్లు మరియు వారి నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై ఓ లుక్ వేద్దాం.

ఎస్.ఎస్. రాజమౌళి: మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’తో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆయన తదుపరి చిత్రంపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. సమాచారం ప్రకారం, ‘వారణాసి’ తర్వాత జక్కన్న మళ్లీ ప్రభాస్ లేదా రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్లలో ఎవరి కాల్షీట్స్ ముందుగా అందుబాటులోకి వస్తే వారితోనే రాజమౌళి నెక్స్ట్ మూవీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

త్రివిక్రమ్ : వెంకీతో ఆదర్శకుటుంబం చేస్తున్న గురూజీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నారు. పాన్ ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ‘గాడ్ ఆఫ్ వార్’ ను నిర్మిస్తున్నారు నాగవంశీ.

సుకుమార్: ప్రస్తుతం రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తున్న ‘RC17’ పైనే సుకుమార్ దృష్టంతా ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ పూర్తయిన తర్వాత సుక్కు చేతిలో పలు ఆసక్తికర ఆప్షన్లు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 3’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడమా లేదా విజయ్ దేవరకొండతో గతంలో అనుకున్న ప్రాజెక్ట్‌ను రీ-స్టార్ట్ చేయడమా అనే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు ఆయన ప్రతిష్టాత్మక ‘ఆర్య’ యానిమేషన్ ప్రాజెక్ట్‌ను కూడా టేకాఫ్ చేసే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగా: తన పవర్‌ఫుల్ టేకింగ్‌తో సంచలనం సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని చేస్తున్నారు. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే ఆయన ప్రధాన ప్రాధాన్యత రణబీర్ కపూర్‌తో చేయబోయే ‘యాన్షియస్’ సీక్వెల్ ‘నిమల్ పార్క్’. ఇవే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగాస్టార్ చిరంజీవితోనూ ఆయన ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.

ప్రశాంత్ నీల్‘కెజియఫ్’, ‘సలార్’ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (#Dragon) ప్రాజెక్ట్ తర్వాత వెంటనే ప్రభాస్‌తో ‘సలార్ 2’  పైనే పూర్తి దృష్టి పెట్టనున్నారు.

నాగ్ అశ్విన్ : మరోవైపు ‘కల్కి 2898 AD’తో భారతీయ సైన్స్ ఫిక్షన్ రేంజ్‌ను మార్చేసిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి పార్ట్ 2’ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

పూరి: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’సినిమాను ఫినిష్ చేసి ఉన్నాడు. నెక్ట్స్ సినిమాపై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు.

కొరటాల శివ : నందమూరి బాలకృష్ణతో చేయబోయే ప్రాజెక్ట్ అనంతరం నేరుగా ‘దేవర 2’ పనుల్లో బిజీ కానున్నారు.

వంశీ పైడిపల్లి : బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్‌తో చేయబోయే ప్రాజెక్ట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనే దానిపై ఆధారపడి ఉంటాయి