Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గ్లింప్స్ ఎలా ఉందంటే?
తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌తో ఫోన్ మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ తిరస్కరించడం లాంటి సహజమైన సన్నివేశాలతో కథనం మొదలవుతుంది. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోగా, ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం.. ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అద్దాలు ధరించిన మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ రూపంలో మెగాస్టార్ హుందాగా కనిపిస్తూనే, ఆ వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. అనంతరం వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్గా ఒడిసిపట్టారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆద్యంతం రిచ్‌గా ఉంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్ జోడించడం గ్లింప్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది lఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సునీల్, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి, భాను-నందు రచనా సహకారం అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!