పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : ‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ
తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఇంట్రో టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇంట్రో టీజర్ విషయానికొస్తే… సోడాల శ్రీదేవితో సూరిబాబు ప్రేమాయణం, ఆమె క్యారెక్టరైజేషన్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలోని “సోడాల శ్రీదేవి” ఇంట్రో టీజర్ ను మీరు కూడా వీక్షించండి.