NTV Telugu Site icon

Swag : మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్…

Meera Jasmin

Meera Jasmin

Swag : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీ విష్ణు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా “ఓం భీం బుష్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.

Read Also:Manamey : పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “స్వాగ్”..ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.వేదరామన్ శంకరన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ కీలక పాత్ర పోషిస్తుంది.తాజాగా స్వాగ్ టీం ఎవర్గ్రీన్ బ్యూటీ మీరా జాస్మిన్ ను పరిచయం చేసింది.ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఉత్పలాదేవి పాత్రలో కనిపించనుంది.తాజాగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో మీరా జాస్మిన్ భారీ ఆభరణాలతో డిజైనర్ వేర్ లో రాణిలాగా కన్పిస్తుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

Whatsapp Image 2024 06 02 At 10.12.22 Am

Show comments