Site icon NTV Telugu

Meena Daughter: హీరోయిన్లను తలదన్నే అందంతో మీనా కూతురు.. షాకింగ్ ఫోటో లీక్ని?

Meena Daughter Nainika Pic

Meena Daughter Nainika Pic

నటి మీనా తన కూతురు నైనిక ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో మీనా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ నటించిన ‘తేరి'(తెలుగులో పోలీసోడు) సినిమాతో బాలనటిగా అందరి మనసు గెలుచుకుంది మీనా కూతురు నైనిక. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా వెండితెరపై కనిపించలేదు. కేవలం ఒకటీ అరా సినిమాలు మాత్రమే చేసింది. తన కూతురు సాధారణ జీవితాన్ని గడపాలని, చదువుపై దృష్టి పెట్టాలని మీనా ఆమెను మీడియా కు దూరంగా ఉంచుతున్నారు. నైనిక పుట్టినరోజున కూడా మీనా పాత ఫోటోలనే షేర్ చేస్తుంటారు కానీ, ఇప్పటి ఫోటోలను ఎప్పుడూ బయటపెట్టలేదు.

Also Read : Maredumilli: మారేడుమిల్లి వెళ్లే టూరిస్టులకి పోలీసుల వార్నింగ్.. ఎందుకో తెలుసా..?

కానీ, ఈ క్రిస్మస్ సందర్భంగా మీనా పక్కన నైనిక నిలబడి ఉన్న ఒక ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. “మీనా అంత జాగ్రత్తగా ఉంటున్నా నైనిక ఫోటో ఎలా లీక్ అయ్యింది?” అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే నైనిక పేరుతో ఉన్న ఒక ఇన్స్టా అకౌంట్ నుంచి ఈ పిక్ షేర్ చేశారు. కానీ నిశితంగా గమనిస్తే ఆ ఫోటో వెనుక ఉన్న నిజాన్ని ఎవరైనా ఇట్టే కనిపెట్టవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫోటో ఒరిజినల్ కాదు, అది ఒక ఎడిటెడ్ ఫోటో. మీనా విడిగా దిగిన ఒక ఫోటోను, నైనిక పాత ఫోటోను కలిపి ఎవరో కావాలని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇద్దరి హెయిర్ స్టైల్స్, ఫోటో క్వాలిటీని గమనిస్తే అది ఫేక్ అని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాక అసలు ఆ అకౌంట్ ఎవరిదో కూడా క్లారిటీ లేదు.

Also Read : Getup Srinu: పక్కన ఎవరైనా వాయిస్తున్నారా?.. రివ్యూయర్స్ పై గెటప్ శ్రీను సంచలనం

ఎందుకు ఇంతలా సీక్రెట్‌గా?
మీనా స్వతహాగా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన వ్యక్తి. సినిమా షూటింగ్‌ల వల్ల ఆమె తన బాల్యాన్ని, చదువును సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు. ఆ పరిస్థితి తన కూతురికి రాకూడదని మీనా గట్టి నిర్ణయం తీసుకున్నారు. నైనికకు సినిమాల కంటే చదువుపైనే ఆసక్తి ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా నైనిక యాక్టివ్‌గా ఉండదు. తనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలని మీనా ఆశిస్తున్నారు. రీసెంట్‌గా ఒక పెళ్లి వేడుకలో తీసిన గ్రూప్ ఫోటోలో తప్ప, నైనిక సోలో ఫోటోలు ఏవీ బయటకు రాలేదు. కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో కేవలం అభిమానుల సృష్టి మాత్రమే అని చెప్పాలి. మీనా తన కూతురిని లైమ్ లైట్ కి దూరంగా ఉంచాలనుకుంటున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. తప్పుడు ఫోటోలను నమ్మి ప్రచారాలు చేయకుండా ఉండటమే ఆ చిన్నారి ప్రైవసీకి మనం ఇచ్చే గౌరవం.

Exit mobile version