Site icon NTV Telugu

Ravi Teja : రోత పుట్టించిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్.. టూ మచ్

Mass Jatara

Mass Jatara

మాస్ మహారాజ ర‌వితేజ హీరోగా భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’.  టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర.

తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో మాస్ మ‌హారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఓలే ఓలే అని సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చి గాత్రదానం చేసిన ఈ పాట విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. గుంట.. ఉంట.. పంట.. తింటా.. నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.. బుద్ది లేదు..జానం లేదు..సిగ్గు లేదు..శరం లేదు.. ఇది భాస్కర్ యాదవ్ దాసరి రాసిన జానపద పాట. వరల్డ్ సినిమా మ్యూజిక్ ను వింటున్న ఆడియెన్స్ కు ఎంత మంచి సాంగ్ ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా తోచినట్టుగా రాసేసి ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్ చేసేస్తే వాళ్లే చూస్తారులే అని ఆడియెన్స్ ను ఎంత గ్రాంటెడ్ గా తీసుకున్నారో ఈ సాంగ్ వింటే తెలుస్తుంది. ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా పాట ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ వింటే ఇది తెలుగు సినిమానేనా అని నోరెళ్ళబెట్టడమే ప్రేక్షకుల వంతు.

Exit mobile version