RT 75 : మాస్ మహారాజ్ ‘మాస్ జాతర’ గ్లిమ్స్.. మనదే ఇదంతా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.
జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా, ‘మాస్ జాతర’ గ్లింప్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
రవితేజ సినీ ప్రస్థానంలో “మనదే ఇదంతా” అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లింప్స్ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా ‘మాస్ జాతర’ గ్లింప్స్ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్ మరోసారి రుజువు చేస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్ కు ప్రధాన బలంగా ఉంది. ఈ చిత్రంలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి గతంలో ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో ‘మాస్ జాతర’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?