NTV Telugu Site icon

Raviteja: ఆ క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమా..!

Ravi Teja

Ravi Teja

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సంవ‌త్సరానికి ఎంత లేద‌న్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. గ‌తేడాది కూడా ఆయ‌న్నుంచి ఈగ‌ల్, మిస్టర్ బ‌చ్చన్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలొచ్చిన‌ప్పటికీ అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇక‌పై సినిమాల వేగాన్ని త‌గ్గించాల‌ని క‌థ‌ల ఎంపిక విష‌యంలో చాలా జాగ్రత్తగా వ్యవ‌హ‌రిస్తున్నాడు ర‌వితేజ‌.

ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ. ‘మాస్ జాతర’ అనే సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే మొన్నటిదాకా చేతిలో కనీసం మూడు, నాలుగు, సినిమాలు మెయింటైన్ చేసిన రవితేజ.. ఒక్కసారిగా చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యం. ‘మాస్ జాతర’ సినిమా తర్వాత రవితేజ చేతిలో ఇంకేం సినిమాలు లేవు. కానీ తాజాగా రవితేజ ఓ కొత్త సినిమా ఓకే చేశాడని సమాచారం. ఈ మాస్ హీరో ఒక క్లాస్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడట.

ఆ దర్శకుడు మ‌రెవ‌రో కాదు కిషోర్ తిరుమ‌ల‌. త‌న కెరీర్ స్టార్టింగ్ నుంచి ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’.. లాంటి క్లాస్ హిట్ సినిమాలు తీసిన కిషోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే కిషోర్ రవితేజను కలిసి కథ చెప్పడట, రవితేజ నచ్చి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక ‘మాస్ జాతర’ మూవీ రిలీజ్ అయ్యాక కిషోర్ తిరుమల తో చిత్రం మొదలు పెడతారని తెలుస్తుంది. అంతేకాదు ఆల్రెడీ కిషోర్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట. మరి మాస్ హీరో రవితేజ తో, క్లాస్ లవ్ స్టోరీలు తీసే కిషోర్ తిరుమల ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.