NTV Telugu Site icon

Maruthi : భలే ఉన్నాడే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు : దర్శకుడు మారుతీ

Untitled Design (9)

Untitled Design (9)

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Also Read : Tollywood : ముంబై భామ కోసం ముప్పై వేలు అదనపు ఖర్చు..

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘భలే ఉన్నాడే’ తో టీమ్ అంతా ఏడాదిన్నరగా జర్నీ అవుతున్నారు. ఈ సినిమాతో అందరికీ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎక్సైట్ మెంట్ తో అందరూ వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీం స్క్రీన్ మీదకు రావడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గా శివ సాయి, హీరోయిన్ గా మనీషా, ప్రొడ్యూసర్ గా కిరణ్, ఇలా కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎప్పుడో వచ్చిన ఒక థాట్ ని సాయికి చెప్తే దాన్ని చాలా అద్భుతంగా మలిచి ఈ సినిమాని చేశాడు. ఇలాంటి పాయింట్ ని ఫ్యామిలీ అంతా చూసే విధంగా మలిచాడు. నేను సలహాలు ఇవ్వడం వరకే గాని నిజానికి కష్టపడిందంతా టీమే. నిర్మాతలు చాలా ఇష్టంతో ఈ సినిమా చేశారు. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం మంచి హిట్ ద్వారా వస్తుందని బలంగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కథ మాటలు సాంగ్స్ డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని పక్కాగా కుదిరాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ లో ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే విధంగా డైరెక్టర్ సాయి చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఆడియోస్ అందరికీ థాంక్స్ చెప్తున్నాను.  నేను ఈ రోజుల్లో సినిమాతో ఎలా అయితే వచ్చానో ఈ టీం కూడా అలా ముందుకు రావాలని కోరుకుంటున్నా ను.  13వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్ తో వెళ్లి చూడండి. రాజ్ తరుణ్ సినిమాని చాలా కష్టపడి చేశాడు. ఈ టీమ్ అందరినీ ఎంకరేజ్ చేయండి. అందరికీ థాంక్యు సో మచ్’ అని అన్నారు

Show comments