2020 నుంచి చిత్ర పరిశ్రమకు అస్సలు కలిసి రావడం లేదు. ఇటు చిత్ర పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తుంటే.. మరోవైపు ప్రముఖ నటులు పరిశ్రమకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.