NTV Telugu Site icon

Manjummel Boys : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 05 05 At 7.19.58 Am

Whatsapp Image 2024 05 05 At 7.19.58 Am

తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం మలయాళం మూవీస్ పై పిచ్చ క్రేజ్ వుంది.కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ఆ మూవీస్ తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్.. మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ  మూవీ చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాన్ లాల్ మరియు పక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు.పరవ ఫిలింస్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్ మరియు షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

మలయాళీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి మంచి ఆదరణ లభించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు ఓటిటి ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత అర్దరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.