NTV Telugu Site icon

ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్

Thug Life

Thug Life

లోకననాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో సినిమా రాబోతోంది.

 

పాన్‌ ఇండియా స్థాయిలో భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను ఆ మధ్య గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు దర్శకుడు మణిరత్నం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విదులైనా నాటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా నేడు విలక్షణ నటుడు కమల్ హాసన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు, రిలీజ్ డేట్‌ ను ప్రకటిస్తూ టీజర్‌ విడుదల చేసారు. ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో శింబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గ్లిమ్స్ ను ఒకసారి చుస్తే వింటేజ్ కమల్ ను మరోసారి ప్రేక్షకులకు చూపించాడు మణిరత్నం. ఇక శింబు ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు చూపించారు. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపింది. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక, మలయాళ నటుడు జోజు జార్జ్‌తో పాటు హీరో గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.

Also Read : AHA : జనక అయితే గనక గోల్డెన్ అఫర్ 

Show comments