NTV Telugu Site icon

Manikandan : మరోసారి ఫ్యామిలీ డ్రామాతో వస్తోన్న మణికందన్

Mani

Mani

ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా కొనసాగుతున్న మణికందన్‌కు ఓ ఐడెంటిటీని ఇచ్చింది జై భీమ్. అప్పటి వరకు రైటర్‌గా ఫ్రూవ్ చేసుకున్న ఇతడ్ని కంప్లీట్ స్టార్ చేసిందీ సినిమా. జై భీమ్ సైడ్ ఆర్టిస్ట్‌ను మెయిన్ హీరోగా మార్చేసింది. 2023లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్, రొమాంటిక్ కామెడీ గుడ్ నైట్‌తో సోలో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు మణి. గురక కాపురంలో ఎలా చిచ్చుపెట్టిందో చూపించిన సినిమానే గుడ్ నైట్. మణి యాక్టింగ్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పొచ్చు.

Also Read : RGV : డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

లాస్ట్ ఇయర్ లవర్‌తో సెటిల్డ్ ఫెర్మామెన్స్ చూపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు మణికందన్. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలకు లవర్ చూపించే టార్చర్ ను కళ్లకు కట్టినట్లు చూపించి మెప్పించాడు. సెలెక్టివ్ స్టోరీలను ఎంచుకుంటూ దూసుకెళుతోన్న ఈ యంగ్ హీరో నెక్ట్స్ ప్రాజెక్టు కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌నే నమ్ముకున్నాడు. నకలైట్స్ ఫేం రాజేశ్వర్ కళై స్వామితో కలిసి కుడుంబస్థాన్ అనే మూవీని చేస్తున్నాడు. 2024 మార్చిలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంట మధ్య ఎదురైన స్ట్రగుల్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని డైరెక్టర్ ఇప్పటికే వెల్లడించాడు. రీసెంట్లీ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 24న థియేటర్లలోకి రాబోతుంది. అయితే ఇప్పటి వరకు సోలో హీరోగా టూ హిట్స్ అందుకున్న మణికందన్‌ కొత్త టెన్షన్ నెలకొంది. కుడుంబస్థాన్ హ్యాట్రిక్ హిట్టిస్తుందా లేదోనన్న కంగారు మొదలైంది. ఈ సినిమా హిట్టు మణికి అత్యంత కీలకంగా మారనుంది. మరీ దర్శకుడు రాజేశ్వర్ హీరోకు హ్యాట్రిక్ హిట్టిస్తాడో లేదో.