Site icon NTV Telugu

Mani Sharma – Bheems : అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో భీమ్స్ ముచ్చట్లు!

Bheems Manisharma

Bheems Manisharma

మెలోడీ బ్రహ్మగా, స్వరబ్రహ్మగా మణిశర్మను పిలుస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు కాదు కానీ, ఒకప్పుడు తెలుగులో వరుస సూపర్ హిట్‌లు కొట్టాడు. తెలుగులో మెలోడీ సాంగ్ రావాలంటే వెంటనే మణిశర్మకు ఫోన్ వెళ్లాల్సిందే. అలా కొంతకాలం పాటు తెలుగు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆయన, తర్వాత దేవిశ్రీప్రసాద్, తమన్, జీవీ ప్రకాష్ కుమార్ వంటి వాళ్లు ఫామ్‌లోకి రావడంతో కాస్త సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు, కానీ ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి ఆయన రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, అప్పుడప్పుడు పాకెట్ మనీ కోసమన్నట్లు సినిమాలు చేస్తున్నాడు. అలాంటి మణిశర్మతో ప్రెసెంట్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన భీమ్స్ సిసిరోలియో మాటామంతి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Bheems Ceciroleo: భీమ్స్ పేరులో ‘సిసిరోలియో’ అంటే ఏంటో తెలుసా?

అదేంటి, వీరు ఎక్కడ కలిశారు అని అనుమానం రావచ్చు. వీరిద్దరూ హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ పార్క్‌లో వాకింగ్‌కి వెళ్తారు. అక్కడే వీరిద్దరూ కలిసి ముచ్చటించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పటి మెలోడీ బ్రహ్మ నుంచి ప్రెసెంట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ ఏవో టిప్స్ నేర్చుకుంటున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద, వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం బీమ్స్, అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, మణిశర్మ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన ఆల్బమ్స్ ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్.

Exit mobile version