Mani Ratnam:న్యూ జనరేషక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్‌గా పిలుపందుకున్న వాళ్లలో ముందుండే పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశ దిశను మార్చేలా ఆయన తీసిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి, వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్ లవ్ స్టోరీస్. అందుకే యూత్‌లో మణి సినిమాలకు అంత క్రేజ్. కానీ ఆ మధ్య కొంత కాలంలో ఆయన ఫామ్ తగ్గిపోయింది ఎక్కువ ఫ్లాపులు చవి చూశారు. తిరిగి దుల్కర్ సల్మాన్ తో ‘ఓకే బంగారం’ మూవీతో ఫామ్ లోకి వచ్చినట్టే వచ్చి.. కడలి, చెలియా, నవాబ్, లాంటి సినిమాలతో మళ్ళీ వెనక్కి పడిపోయాడు మణి. దీంతో ఈ సారి బారి ప్లాన్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ తీసి తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు.
ప్రజంట్ కమల్ హాసన్, శింబుతో ‘తగ్ లైఫ్’ మూవీ పూర్తి చేసిన మణిరత్నం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. సమర్‌లో విడుదలకు ప్లాన్ చేయడంతో దానికి అనుగుణంగా అని పనులు ఫినిష్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పూర్తి అయిన తర్వాత మణిరత్నం తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే డౌట్ అందరిలో మొదలైంది. ‘దళపతి’ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు అని, రజనీకాంత్ కు ఒక కథ కూడా చెప్పారని టాక్ గట్టిగా వినపడుతుంది కాని..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Also Read : SSMB29:మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి
దానికి సమయం పటేలా ఉండటంతో, న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట మణి . అది కూడా ఒక కొత్త యంగ్ హీరో అండ్ హీరోయిన్ తో.. అంతేకాదు అతి తక్కువ బడ్జెట్‌లో వేగంగా పూర్తయ్యేలా ఈ లవ్ ఎంటర్టైనర్ ఉంటుందని చెన్నై టాక్. త్వరలో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. మణిరత్నం సినిమాలో రొమాన్స్ అంటే ఒకప్పుడు తెరమీద కవిత చదువుతున్న భావన కలిగేది. మరి ఈ వయసులో కూడా అదే ఇంపాక్ట్ ఇచ్చేలా కథ తీసుకుంటారేమో చూడాలి.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!