Mangli: మంగ్లీకి బిగ్ షాక్… ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ (సత్యవతి) చుట్టూ వివాదాల ఉచ్చు బిగుస్తోంది, తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో నిరుపేదలను మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో, ఆమెను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో భారీగా నిధులు వసూలు చేసి, బాధితులకు అన్యాయం చేసిన వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు మంగ్లీపై వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా కేసు నమోదైంది. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో మంగ్లీ పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వివాదం కేవలం పోలీస్ స్టేషన్‌కే పరిమితం కాకుండా ఫిలిం నగర్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ఈ విషయంలో చాలా ఘాటుగా స్పందించారు. నిరుపేదల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్ము విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని వదిలిపెట్టకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. “బాధిత నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి” అని తెలంగాణ MAA జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ పేర్కొన్నారు. సంపత్ నాయక్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటూ, మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సరికాదని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఆమెను సినిమాల నుంచి పక్కన పెట్టాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!