Site icon NTV Telugu

Manchu Vishnu : కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప..

Kannappa

Kannappa

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు.

Also Read : UnstoppableS4 :  UnstoppableS4 : దుల్కర్ చెప్పిన 12వ తరగతి ప్రేమ కథ..

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కన్నప్ప డిసెంబరు రిలీజ్ లేనట్టే అనిపిస్తోంది. అందుకు పుష్ప -2 కారణం కనిపిస్తోంది. ఆగస్టులో రావాల్సిన పుష్ప డిసెంబరు 5న వస్తుండడం, వరల్డ్ వైడ్ గా ఆ సినిమాకు భారీ హైప్ ఉండడంతో కన్నప్ప కామ్ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. క్రిస్టమస్ కానుకగా వేద్దామా అనుకుంటే ఆ డేట్ కు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న మరో సినిమా నితిన్ రాబిన్ హుడ్ 20న డేట్ వదిలారు. ఇక సంక్రాంతి సంగతి సరేసరి. అక్కడ కన్నప్ప వచ్చేందుకు స్పేస్ లేదు. రిపబ్లిక్ రోజు అంటే రోజు మాస్ మహారాజ్ మాస్ జాతర ఉంది, ఫిబ్రవరి లో తండేల్ అని టాక్. మరి ఇంత టైటు షెడ్యూల్ మధ్య కన్నప్ప ను ఎప్పుడు తీసుకువస్తారో అని గందరగోళం నెలకొంది.మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకమైన సినిమా ఎప్పడూ వస్తుండోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మేకర్స్ ఎదో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version