NTV Telugu Site icon

Sabdham : ‘శబ్దం’ మూవీ పై మంచు మనోజ్ రివ్యూ..?

Untitled Design (61)

Untitled Design (61)

యంగ్ హీరో ఆది పినిశెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు అన్ని భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కొంత గ్యాప్ తర్వాత ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివళగన్ దర్శకత్వంలో, తమన్ సంగీత సారథ్యంలో 14 ఏళ్ళ క్రితం వచ్చిన ‘వైశాలి’ మూవీ అంతా చూసే ఉంటారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబో కలిసి ‘శబ్దం’ అనే చిత్రం వచ్చింది. ‘వైశాలి’ లో నీటిని బేస్ చేసుకుని కథ రాస్తే.. శబ్దం చిత్రంలో సౌండ్‌ను బేస్ చేసుకుని కథను రాసుకున్నాడు. అయితే చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడంతో ఆడియెన్స్‌కి అంతగా ఈ మూవీ కనెక్ట్ కాలేకపోతుంది. స్టోరి పాయింట్‌ను బ్రిల్లియెంట్ టెక్నికల్ అంశాలతో కథను చెప్పేందుకు ప్రయత్నించిన తీరు బాగున్నప్పటికి..

కథను, కథ లోని అంశాలు సరళీకృతం చేసి.. సాధారణ ఆడియెన్స్‌కు అర్ధమయ్యేలా చెప్పి ఉంటే సినిమాకు మరింత ఎమోషనల్‌,ఎక్కువ కనెక్టివిటీగా వచ్చేది. కానీ ఫస్టాఫ్‌ను చాలా గ్రిప్పింగ్‌గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుండటమే కాకుండా ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. అంతేకాదు ఈ మూవీకి తమన్ ఇచ్చిన సౌండింగ్, ఆర్ ఆర్ అద్భుతంగా ఉంటుందట.. దాంతో అందరూ ఈ సినిమాను మాత్రం కచ్చితంగా థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా పై మంచు మనోజ్ రివ్యూ ఇచ్చారు..

‘రీసెంట్‌గా ‘శబ్డం’ సినిమా చూశాను స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు.ఆది అద్భుతంగా నటించారు, తమన్ అయితే అదరగొట్టేశాడు. అరివళగన్‌కి కంగ్రాట్స్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్.. థియేటర్లోనే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని మనోజ్ ట్వీట్ చేశారు.