Site icon NTV Telugu

Manchu Manoj: కన్నప్ప సినిమాకు భైరవం పోటీ.. ఇదెప్పుడు జరిగింది?

Manchu Manoj Vs Manchu Vishnu

Manchu Manoj Vs Manchu Vishnu

మంచు వారి కుటుంబ వివాద వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మంచు మనోజ్, ఈ రోజు జల్పల్లి నివాసానికి వెళ్లి కలకలం సృష్టించి వచ్చాడు. అదంతా పక్కన పెడితే, అక్కడ మీడియా ముందు మాట్లాడిన ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, “ఈ పోరాటం ఇలా కాదు, ఏదైనా ఉంటే స్క్రీన్ మీద చూసుకుందాం, పని విషయంలో పోరాడదాం” అని తాను నటించిన ‘భైరవం’ అనే సినిమాను ‘కన్నప్ప’ సినిమాకు పోటీగా దించాలని భావించినట్లు చెప్పుకొచ్చాడు.

JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్

అది తెలిసి మంచు విష్ణు తన ‘కన్నప్ప’ను వాయిదా వేసుకున్నాడని, ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక తన ఇంట్లో వస్తువులు దొంగతనం చేసి, కారు దొంగతనం చేసి తీర్చుకున్నాడని మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే, ఇదంతా లాజికల్‌గా అనిపించడం లేదు. ఎందుకంటే, 25వ తేదీన రిలీజ్ చేస్తామని విష్ణు ఎప్పుడో ప్రకటించాడు. కానీ, భైరవం రిలీజ్ విషయంపై మొదటి నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఊహాగానాలతో ‘కన్నప్ప’కు పోటీగా రిలీజ్ చేయవచ్చని ప్రచారం జరిగింది కానీ, ఇంత తేదీన రిలీజ్ చేస్తామని ఎప్పుడూ ప్రకటించలేదు. ఇప్పుడు “మాకు పోటీ వస్తున్నాడు కాబట్టే ఇలా జరిగింది” అంటూ కామెంట్స్ చేయడం లాజికల్‌గా కరెక్ట్ అనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

Exit mobile version