Site icon NTV Telugu

Manchu Lakshmi: మొత్తానికి భర్తతో విడిపోవడం పై నోరు విప్పిన మంచు లక్ష్మి !

February 7 2025 02 24t141902.987

February 7 2025 02 24t141902.987

మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్‌ విషయంలో చాలా సార్లు విమర్శలు ఎదుర్కొంది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చిందని..ఈ విడాకులు వెనుక తండ్రి మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణలు వినిపించాయి.

Also Read: Priya bhavani: అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి..

కానీ ఈ విషయాలపై ఆమె ఎప్పుడు స్పందించలేదు. అందులోను ఆమె తన భర్తతో పెద్దగా ఎప్పుడు బయట కనిపించలేదు.దీంతో ఈ రూమర్స్ మరింత పుంజుకున్నాయి. అయితే తాజాగా ఈ పుకార్లన్నింటికి పుల్ స్టాప్ పెట్టింది మంచు లక్ష్మి. తాజాగా తన భర్త గురించి నోరు విప్పింది. ‘నా భర్త ఫారెన్‌లో ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నారు. మేము మా వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. మా ఇద్దరికి బాధ్యతలు ఉన్నాయి. మోము విడిపోలేదు కలిసే ఉన్నాము. మాకు నచ్చినట్లుగా బతుకుతున్నాము.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించాల్సిన పని లేదు. నా కూతురు ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Exit mobile version