Site icon NTV Telugu

Manchu Lakshmi : నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ ఫెలో..

Manchu Laxmi

Manchu Laxmi

సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పుడు ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నే ఉంటుంది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మంచు మ‌నోజ్, విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు తారా స్థాయికి చేరాయి. కుటుంబ విభేదాలు కాస్త వీధి కెక్కాయి. అయితే ఈ గొడ‌వ‌ల‌పై మంచు ల‌క్ష్మీ ఏ నాడు మాట్లాడింది లేదు. అలా అని ఎవ‌రికి స‌పోర్ట్ చేసింది కూడా లేదు. కానీ మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మంచు లక్ష్మిని కలిశాడు. స‌డెన్‌గా మ‌నోజ్‌ని అక్కడ చూసిన మంచు ల‌క్ష్మీ భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంది. కుటుంబంలో జరుగుతున్న తగాదాల మధ్య మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోష‌న‌ల్ అయిన వీడియో నెట్టింట చాలా వైరల్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై లక్ష్మి రియాక్ట్ అయింది.

Also Read : Nagachithanya : నాగచైతన్య ‘ఎన్‌సీ 24’ షూటింగ్ అప్‌డెట్

రీసెంట్ గా బుల్లి తెరపై ఓ షో లో పాల్గొన్న మంచు లక్ష్మి ‘నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేరు. నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. సడెన్ గా వాడ్ని అక్కడ చూసేసరికి ఆనందంతో చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. మ‌న చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్. అక్కడ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చారు. కానీ నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయ్యాను. అదే సమయంలో మనోజ్ చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎలా ఉన్న మా ఇద్దరి మధ్య బంధం వేరు’ అంటూ కాస్త ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది మంచు ల‌క్ష్మీ.

Exit mobile version