NTV Telugu Site icon

Manchu Case : మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్.!

Manchu Manoj

Manchu Manoj

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమనట్టే అనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఘర్షణ వాతావరణంలో మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులను ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికిల్స్ అన్నింటినీ మంచు టౌన్ షిప్ బయటకు పంపిస్తున్నారు పోలీసులు. కాగా మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు.

Also Read : Bollywood : పుష్ప -2 హిందీలో ఇప్పట్లో ఆగేలా లేదు.. మొత్తం ఎన్ని కోట్లంటే.!

మోహన్ బాబు మేనేజర్ గా పనిచేస్తున్న వెంకట కిరణ్ కుమార్ ను పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసారు. మరోవైపు సీసీఫుటేజ్, హార్డ్ డిస్క్ లు దొంగిలించిన విజయ్ కోసం గాలిస్తున్న పోలీసులు. మనోజ్ పై దాడి జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు విజయ్.రేపో మాపో విజయ్ ను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇటీవల ఈ వినయ్ అనే వ్యక్తిపైనే మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. మోహన్ బాబు కు చెందిన విద్య నికేతన్ సంస్థల్లో వినయ్ అక్రమాలు చేస్తున్నడని, మా నాన్నగారికి చెబుతున్న పట్టించుకోవడం లేదు అని తెలిపారు మనోజ్. కిరణ్ అనే వ్యక్తులని పట్టుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments