Site icon NTV Telugu

కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్

Manchi Rojulochaie Movie Characters Intro

యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు.

Read Also : నవరస నటనాసార్వభౌముడు… సత్యనారాయణ

మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. మారుతీ స్టైల్ సిట్యుయేషనల్ కామెడీ నవ్వులు పూయిస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో సంతోష్, మెహ్రీన్ జంట చూడముచ్చటగా ఉంది. టీజర్ లోని నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.

Exit mobile version