Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రపరిశ్రమలోనే కాదు, యావత్ భారత చలనచిత్ర రంగంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచిన బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ (Patriot). మలయాళ సినీ దిగ్గజాలు, లెజెండరీ నటులు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) సుమారు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని..‘టేకాఫ్’, ‘మాలిక్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. గూఢచర్యం, రాజకీయాలు, అత్యాధునిక టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం.. నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. రాబోయే జూన్ 5వ తేదీ నుండి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జూన్ 5 నుంచి మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అధికారం ఆధారంగా నడిచే ప్రస్తుత వ్యవస్థలో, నియంత్రణ లేని ‘ప్రభుత్వ నిఘా’ (Surveillance) సాధారణ ప్రజల ప్రైవసీకి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ సినిమాలో చూపించారు.తాను సృష్టించిన వ్యవస్థే ప్రజల పాలిట శాపంగా మారిందని గ్రహించిన ఆ వ్యక్తి.. దానికి ఎదురు తిరుగుతాడు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ క్రమంలో తను నిజాన్ని బయటపెట్టడం దేశద్రోహమా? లేక నిజమైన దేశభక్తి చర్యనా? అనే ప్రశ్నలతో అతను చేసే పోరాటమే ఈ సినిమా. దేశభక్తికి, దేశద్రోహానికి మధ్య ఉన్న సన్నని గీతను దర్శకుడు ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. కేవలం మమ్ముట్టి, మోహన్‌లాల్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార, వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, కుంచాకో బొబన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ హై-వోల్టేజ్ డ్రామా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఇంటెన్సివ్ విజువల్ వండర్‌గా రాబోతున్న ‘పేట్రియాట్’ సినిమాను వచ్చే నెల జూన్ 5 నుండి మీ జీ5 యాప్‌లో వీక్షించడం అస్సలు మిస్ అవ్వకండి!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?